తెలుగు బ్లాగర్లు మరియు వికీపీడియన్ల సమావేశం, నవంబరు 2006 – విశేషాలు

నవంబర్ 13, 2006 at 1:45 ఉద. 8 వ్యాఖ్యలు

ఈ విశేషాలు రాయడానికి నాకు చాలా సంతోషంగాఉంది. ఎందుకంటే, ఇప్పటివరకు అత్యంత విజయవంతమైన తెలుగు బ్లాగర్ల సమావేశం ఇదే కాబట్టి. వేదిక దూరమైనా గత సమావేశాలకంటే ఈసారి వచ్చినవారి సంఖ్య అధికం. (ఫొటోలు వస్తున్నాయి.)

ఈ సమావేశాలన్నింటి ప్రత్యేకతేంటంటే, ప్రతీసారీ ఉల్లాసంగా, ఉత్సాహంగా, సమయం తెలియకుండా సాగిపోతాయి. మీరు సమావేశానికి రాలేదంటే, ఖచ్చితంగా ఏదో మిస్సవుతునారనే. హైదరాబాదులో లేనివారు, మీరూ మీ నగరం లేదా పట్టణంలో బ్లాగర్లు మరియు వికీపీడియన్ల సమావేశం నిర్వహించండి. ఇక హైదరాబాదులో ఉండి రాలేకపోతున్నవారు, రావడానికో సాకు వెతుక్కోండి. తర్వాతి హైదరాబాదు సమావేశం డిసెంబరు 10, ఆదివారం నాడు, మీ కోసం ఎదురుచూస్తుంటాం!.
అనుకున్నట్టుగానే అందరం హైదరాబాదు యూనివర్సిటీకి చేరాం. అందరం మొదట కలిసింది కాంటీన్ దగ్గర. పానీయాల తర్వాత (కొంత ఆలస్యంగా వచ్చినవారికి లేకుండానే), మార్గదర్శి మీద చర్చ మొదలెట్టారు. మొత్తం మీద రామోజీరావుకి అప్పులకన్నా ఆస్తులే ఎక్కువున్నాయని, కాకపోతే ఈ యాగీకి ఆయన ప్రతిస్పందన చెల్లింపులు ఎలా చేస్తారో అన్నదానిపై మరింత నిర్ధిష్టంగా ఉండాల్సిందనీ అభిప్రాయపడ్డాం.

ఈలోగా, వెబ్ లో తెలుగు గురించిన కరపత్ర కాపీలని, వెంకటరమణ తీసుకొచ్చాడు. ఈ కరపత్రాన్ని చావా కిరణ్ అభ్యర్ధన మేరకు నేను చేసా. మీరిక్కడనుండి దిగుమతి చేసుకొని ప్రచారానికి వాడుకోవచ్చు.) వాటిని తీసుకొని లోపలికి బయలుదేరాం.

యూనివర్సిటీలో మాకు సహాయంగా కశ్యప్ వాళ్ళ తమ్ముడు (భార్గవ్ రామ్) ఉన్నాడు. (తనక్కడ ప్రదర్శన కళ లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నాడు.) కరపత్రాలు అంటిస్తూ, వివిధ విభాగాలకి దారిచూపుతూ, చివరగా జరిగిన చర్చలో కూడా ఉత్సాహంగా పాల్గొన్నాడు.

ఇలా కరపత్రాలు అంటిస్తూ, కబుర్లు చెప్పుకుంటూ, ఒక చోట పచ్చికమీద చతికిలపడ్డాం. భార్గవ్ యొక్క బ్లాగెందుకు అన్న సందేహం తీర్చడానికి చదువరి అందరం మనమెందుకు బ్లాగుతున్నామో చెప్పమనడంతో, ఒక్కొక్కరూ తమ బ్లాగోతం వరుసగా చెప్పుకొచ్చారు. ఈ ప్రక్రియలో, కంప్యూటర్లో తెలుగు చూడవచ్చు, రాయవచ్చు అని ఎవరెవరు ఏవిధంగా తెలుసుకున్నారో తెలియజెప్పారు. 1998 లో తీవ్రవాదుల వద్ద పోలీసులకి దొరికిన లాప్ టాప్ లో ఎర్ర సాహిత్యం తెలుగులో చూసి ఆశ్చర్యపోయి, ఇంగ్లీష్ వికీపీడియా పరిచయమై అక్కడనుండి తెలుగు వికీపీడియా గురించి తెలిసి, వాకా మరియు చావా కిరణ్ ల బ్లాగులు మెయిల్లు చూసి, యుడిట్ తో తిప్పలుపడి మరీ తెలుగు రాసి, ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో కధ. బ్లాగు కురువృద్దుల నుంది బ్లాపాయిలవరకు అందరి సంగతులు వినడం బాగుంది.

ఇలా బ్లాగోతాలు సరదాగా సాగుతుండగానే చీకటి చిక్కనవడం మొదలుపెట్టింది. ఓ ఛాయ్ తాగి నిష్క్రమిద్దామని అక్కడినుండి లేచాం. ఇక కాంటీన్లో టీ తాగుతూ ఇంకా మనం ఏంచేయాలి అన్న దానిమీదని చర్చ మళ్ళింది.

ఈనాడు ఆదివారంలో వికీ ముఖచిత్ర కధ వల్ల తెవికీలో 500 పైబడి సభ్యులు చేరారు. వీరందరిచే నిలకడగా అర్ధవంతమైన చేర్పులు ఎలా చేయించాలి. ఇంకో వారానికి వీళ్ళకి తెవికీ గుర్తుంటుందా? వీరందరికీ వారి సభ్యత్వాన్ని గుర్తుచేస్తూ ఈ-మెయిల్లు పంపవచ్చా? స్వాగత సందేశాన్ని మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దగలమా? వికీమీడియా వారి మెయిలింగులిస్టు మన తెలుగుకీ ఒకటి ప్రత్యేకంగా ఒకటి సృష్టించాలా?

ఇక కార్యాచరణ అంశాలతో ఈ సంగతులని ముగిస్తాను.

 • వివిధ వెబ్ ఇంటర్ఫేసుల స్థానికీకరణకి మన ప్రయత్నాలు మందగించాయి. వీటిని మళ్ళీ ఓ పట్టు పట్టాలి:
  • మీ భాషలో గూగుల్: వందశాతం పూర్తయినట్టు అక్కడున్నా, అందులో ఇంకా దాదాపుగా నలభై శాతం తెంగ్లీషులో ఉన్నాయి. వీటిని తెలుగులిపిలోకి మార్చాలి.
  • వర్డ్‌ప్రెస్ అనువాదం
 • తెవికీలో అచేతన సభ్యులని క్రియాశీలురయేలా ప్రేరేపించడం (వారినెలా చేరాలి?)
 • కంప్యూటర్లో తెలుగు చూడవచ్చు రాయవచ్చు అని జనావళికి తెలియజేయడం. (చాలామందికింకా తెలియదు.)
 • ఇతర నగరాలు, పట్టణాల్లో తెలుగు బ్లాగర్లు మరియు వికీపీడియన్ల సమావేశాలకి ఆయా సభ్యులని ప్రోత్సహించడం

—వీవెన్.

ప్రకటనలు

Entry filed under: తెలుగు, Events, Telugu.

సెప్టెంబర్ నెల తెలుగు బ్లాగర్ల సమావేశం, హైదరాబాద్ — అజెండా

8 వ్యాఖ్యలు Add your own

 • 1. శ్రీహర్ష  |  8:11 ఉద. వద్ద నవంబర్ 13, 2006

  చాలా చక్కగా వివరించారు వీవెన్ గారు నిన్న జరిగిన సమావేశం గురించి.

  ఈ సమావేశాలన్నింటి ప్రత్యేకతేంటంటే, ప్రతీసారీ ఉల్లాసంగా, ఉత్సాహంగా, సమయం తెలియకుండా సాగిపోతాయి.
  ఈ వాక్యమైతే, అచ్చంగా నేను అనుకున్న మాటలే 🙂

  మీ పోష్టు చదువుతున్నంతసేపూ మళ్లీ సమావేశంలో పాల్గొంటున్న అనుభూతి కలిగింది.

  స్పందించండి
 • 2. రవి వైజాసత్య  |  4:48 సా. వద్ద నవంబర్ 13, 2006

  భలే భలే ఇంత బాగా ఈ నివేదికను సమర్పించినందుకు వీవెన్ గారికి కృతజ్ఞతలు.

  స్పందించండి
 • 3. Sree Ganesh Thottempudi  |  8:30 ఉద. వద్ద నవంబర్ 14, 2006

  అందరికీ నమస్కారం!
  ఈ వివరణ చాలా బాగుంది. ముందలి లక్ష్యాలను కొంచెం బాగా వివరిస్తే బాగుండేది. ముఖ్యంగా మా యూనివర్శిటీలో ఇటువంటి కార్యక్రమం జరగటం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ కార్యక్రమంలో పాల్గోలేక పోయినందుకు కొంచెం బాధగా కూడా ఉంది. మీ లక్ష్యాలను అందుకోవటంలో అవిశ్రాంత కృషి చేస్తారని మసన్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ …….. పదండి ముందుకు పదండి తోసుకు పోదాంపోదాం పైపైకి.
  ధన్యవాదాలు.
  గణేష్

  స్పందించండి
 • 4. RaaM  |  9:08 ఉద. వద్ద నవంబర్ 14, 2006

  Khaminchali….eekkada oka chinna vinnapam… Pradarsana kalalu…Rangastala Kalalaki chala teda undi…Bhargava chesedi “Rangastala kalalu”.. means Perfoming Arts…e tedani na blog lo vivaristanu..untanu…

  స్పందించండి
 • 5. rammohan  |  10:13 ఉద. వద్ద మార్చి 17, 2008

  nenu kottaga chustannanu telugu naa abeprayam ela pampalo naku kontcham evaraina dayachese cheppara pleaseeeeeeeeeee

  స్పందించండి
 • 6. rammohan  |  10:14 ఉద. వద్ద మార్చి 17, 2008

  naa mail i d nrammohan9@yahoo.com

  స్పందించండి
 • […] జూలై 2006 సమావేశం, ఆగష్టు 2006, నవంబర్ 2006 […]

  స్పందించండి
 • 8. yangeverett9918  |  10:11 ఉద. వద్ద ఏప్రిల్ 8, 2016

  I couldn’t get this site to work properly on it, so I went back to Firefox. It works for you?https://ameo.link/yangeverett991808180

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


నవంబర్ 2006
సో మం బు గు శు
« సెప్టెం    
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

ఇటీవలి టపాలు


%d bloggers like this: