ఆగష్టు నెల తెలుగు బ్లాగర్ల సమావేశపు విశేషాలు

ఆగస్ట్ 21, 2006 at 5:19 ఉద. 12 వ్యాఖ్యలు

 1. తెలుగు బ్లాగులపై వ్యాసాన్ని ఏదైనా ఒక పత్రికలో ప్రచురించడానికి కృషి: ప్రస్తుత (తెవికీ లోని) వ్యాసాన్ని ప్రచురింపజేయడానికి మురళి కృష్ణ (కూనపరెడ్డి) తన ప్రయత్నం కొనసాగిస్తాడు. ఒక పత్రిక ప్రచురించిన వ్యాసం మరో పత్రిక వాళ్ళు వేసుకోరు కనుక మరో పత్రిక కోసం మరో వ్యాసం రాస్తే భాస్కరరావుగారు తనకున్న పరిచయాలతో ప్రయత్నం కొనసాగిస్తారు.
 2. గతంలో చేసిన పుస్తకాల పురుగు లాంటి ప్రయోగాలు మరో రెండు: (1) మీ మీ బ్లాగులలో మీ వెబ్ కార్యక్రమాల గూర్చి రాయండి. మీరే వెబ్‌సైట్లు చూస్తూఉంటారు. వాటిలో మీకు నచ్చిన అంశాలేంటి. ఇలా. (2) నా చేతి తెలుగు రాత — తెలుగులో మీ చేతిరాత ఇలా ఉంటుందో స్కాన్‌తీసి మీ బ్లాగులో ఒక టపా రాయండి. మన తెలుగు బ్లాగరులలో గ్రాఫాలజీ తెలిసినవారెవరైనా ఉంటే వారు ఈ చేతిరాతలని విశ్లేషిస్తూ బ్లాగు టపా(లు) రాయవచ్చు.
 3. తెలుగువారికి సంబంధించిన వెబ్‌సైట్లు తెలుగులో కూడా (యూనికోడ్‌లో) లభ్యమయ్యేలా మనవంతు కృషి చెయ్యాలి. ఇందుకోసం వెబ్‌మాస్టర్లకి అవసరమైన సాంకేతిక సహాయాన్ని తెవికీలో (లేదా మరో వెబ్‌సైట్‌లోనో) ఉంచాలి. ఇలాంటి సమాచారం ఈసరికే వెబ్‌లో ఉందేమో చూడాలి. వైవిధ్యభరితమైన విషయాలపై తెలుగులో వెబ్‌సైట్లు రావడానికి ఇది ఎంతైనా ఉపయోగపడుతుంది. వెబ్‌సైట్ల నిర్వాహకులకు, యజమానులకు ఈ-మెయిళ్ళు రాయాలి. ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్న వారితో (ఉ.దా. తెలుగు బ్రెయిన్స్) కలిసి పనిచేసే అవకాశాల్ని పరిశీలించాలి.
 4. పెద్దవారి వద్దకు: మన తెలుగు బ్లాగులని, తెవికీని ప్రముఖ వ్యక్తులకు పరిచయంచేసి వారినికూడా బ్లాగులో, తెవికీలోనో రాసే విధంగా ప్రేరేపించాలి. ఉ.దా.: యండమూరి, గొల్లపూడి వంటి వారు. దీనికై ముందుగా కొందరు ప్రముఖుల పేర్లు, వారిని ఎలా సంప్రదించాలి అనుకుంటే మనలో ఎవరికైనా వారు తెలిసిఉంటే వారికి నేరుగానూ లేదా మనల్ని పరిచయం చేసుకుంటూనో విషయాన్ని వారికి తెలియజేయవచ్చు.
 5. కంప్యూటర్ని తెలుగుకి సిద్దంచేసే ఉపకరణం: మనలో సాంకేతిక నిపుణులందరూ తలో చేయి వేయండి. saroavar.orgలో ఒక ప్రాజెక్టు ప్రారంభిస్తే ఎలాఉంటుంది? అందరూ కలిసి దానిపై కృషిచేయవచ్చు. మరిన్ని వివరాలకు మురళి కృష్ణ (కూనపరెడ్డి) లేదా చంద్రశేఖర్ లని సంప్రదించండి.
 6. ఇక మన తెలుగు బ్లాగర్లకి (ఎక్కడివారైనా) అందరికీ ఒకే వేదిక. దానికో పేరు కూడా అనుకున్నాం. తెలుగు బ్లాగర్ల ప్రపంచ వేదిక. ఇది ఇక ఏమాత్రం హైదరాబాదుకి పరిమితం కాదు. మీరున్న నగరం లేదా ఊరిలోని తెలుగు బ్లాగర్లు కలిసి నెలనెలా సమావేశాలు నిర్వహించండి. ఆ విశేషాలని ఈ బ్లాగుకి లేదా తెలుగుబ్లాగు గూగుల్ సమూహానికి టపా చేయండి. పైన చెప్పిన అన్ని అంశాల్లోనూ మీ వంతు సహకారాన్ని అందించండి

-వీ

ప్రకటనలు

Entry filed under: తెలుగు, Events, Telugu.

కంప్యూటర్‌కి తెలుగు నేర్పే ఉపకరణం సెప్టెంబర్ నెల తెలుగు బ్లాగర్ల సమావేశం, హైదరాబాద్ — అజెండా

12 వ్యాఖ్యలు Add your own

 • 1. chavakiran  |  5:26 ఉద. వద్ద ఆగస్ట్ 21, 2006

  I like the hand writing thing.

  స్పందించండి
 • […] ఆగష్టు నెల తెలుగు బ్లాగర్ల సమావేశపు విశేషాలు లోని 2(2)వ అంశానికి స్పందనగా నా చేతిరాత. […]

  స్పందించండి
 • 3. Kiran  |  3:57 సా. వద్ద ఆగస్ట్ 21, 2006

  బాగుందండి. మా నాన్న గారికి రావి కొండల రావు గారితో పరిచయం ఉంది. రావి గారు విశాఖ లో Ads4You అనే పత్రిక నడిపినప్పడు మా నాన్న గారు కొన్ని రచనలు చేసారు. రావి కొండల రావు గారి తో ఎమైనా రచనలు చేయించడానికి నేను ప్రయత్నిస్తాను.

  స్పందించండి
 • 4. Sudhakar  |  8:34 సా. వద్ద ఆగస్ట్ 21, 2006

  i posted my handwriting too 😦

  స్పందించండి
 • […]  ఆగష్టు నెల తెలుగు బ్లాగర్ల సమావేశపు విశేషాలు లోని 2(2)వ అంశానికి స్పందనగా […]

  స్పందించండి
 • 6. Ambanath  |  6:44 సా. వద్ద ఆగస్ట్ 23, 2006

  నేనైతే బ్లాగింగ్ అంటేనే తెలియని గణిత్ర వాడకందార్లు (PC users)లెక్కలేనంతమంది ఉన్నారని తెలుసుకున్నాను. బ్లాగ్ సైట్లనేవి ఉన్నాయని తెలిసినవాళ్ళలో నాలుగోవంతుమందికైనా అవి తెలుగులో కూడా చెయ్యవచ్చననే విషయం తెలీదు. తెలుగు కంప్యూటరీకరణ చెందుతున్న వైనం చెప్పినప్పుడు చాలామంది ఆశ్చర్యంతో నోరువెళ్ళబెట్టారు, How come ! అన్నట్లు. (దళితుణ్ణి పూజారిగా చూసినప్పటి దిగ్భ్రాంతి వాళ్ళ కళ్ళల్లో)

  స్పందించండి
 • 7. charasala  |  4:43 సా. వద్ద ఆగస్ట్ 29, 2006

  నాకెప్పట్నుంచో ఈ ఆలోచన వుంది. తెలుగుని, తెలుగు బ్లాగింగుని, తెలుగు మాధుర్యాన్ని పెంచడానికి మీ కృషి మెచ్చదగింది. తెలుగు మాట్లాడటం చిన్నతనం కాదు, ఇంగ్లీషులో మాట్లాడటం గొప్పదనం కాదు అని తెలియజేస్తే తెలుగులో మాట్లాడ్డానికి ఎక్కువ మంది ముందుకు వస్తారు. అలాగే తెలుగు మాట్లాడని వారి మీద ఏదో ఒక విధంగా మనం ఒత్తిడి తేవడానికి ప్రయత్నించాలి. దీనికి ఒక వేదిక వుండాలి. మన ఆలోచనలని తెలియజేయడానికి పంచుకోవడానికి మనకు బ్లాగింగు మంచి అవకాశంగా వుంది. అయితే ఎక్కువ మందిని బ్లాగులు చదవడానికి, రాయటానికి ప్రోత్సహించాలి, ఆకర్షించాలి.
  మీ ప్రయత్నాలను నీరు గార్చే వుద్దేస్యం నాకు లేదు కానీ, తెలుగు వ్రాయడానికి ఇప్పుడే తగినన్ని సాధనాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఎక్కువమందిని ఆకర్షించటానికి తెలుగు బ్లాగింగు గురంచి తెలియచెప్పడానికి మనం పత్రికల వెంట పడటానికి బదులు వాళ్ళే మన వెంట పడేలా చేసుకోలేమా?
  ఎక్కడైనా పదిమందికి ఉపయోగపడేది, ఉత్సుకత కలిగించేది వుందంటే వాళ్ళు ఖచ్చితంగా వచ్చితీరాల్సిందే. చెప్పినమాటే చెప్పి, ఆడిన మాటే తప్పే రాజకీయుల మాటలు నమోదు చేయడానికి పరుగెత్తే వాళ్ళు పది మంచి మాటాలు చెప్పి, నాలుగు మంచి పనులు చేస్తే మన మాటలు, చేష్టాలు నమోదు చేయడానికి రారంటారా?
  రోజూ ఈనాడులో “ఈ గుండెను ఆగిపోనివ్వకండి”, “ఈ సరస్వతీ బిడ్డను ఆదుకోండి” లాంటి ఎన్నో వార్తలు చూస్తూ వున్నాం. మనందరం కలిస్తే నెలకు ఓ గుండెకు ఆపరేషను చేయించలేమా? ఓ పేదరాలి చదువుకు సహాపడలేమా? ఒక నిరుపేద బస్తీకెళ్ళి వీధుల్ని శుబ్రం చేయలేమా? చలికి రోడ్డుపక్కన అల్లాడే బిక్షగాండ్రకు దుప్పట్లు పంచలేమా? కనీసం ఏడాదిలో ఒక్కసారి రక్తదానం చెయ్యలేమా?
  ఈ పనులు చేస్తూ వీటికి ప్రత్యుపకారంగా తెలుగును మాట్లాడండి, రాయండి, చదవండి అంటే మన మాటను పత్రికలు భేఖాతరు చేస్తాయంటారా?
  గాంధీ ఆత్మకథను చదవకుంటే ఒకసారి చదవండి, చదివుంటే మళ్ళీ ఒకసారి పునఃక్షరణ చేయండి. ప్రతిపలం లేకుండా సత్యనిష్టతో తను నమ్మిన ధర్మాన్ని తను నిష్టగా పాటించడమే తనకు అంతమంది నమ్మకాన్ని సంపాదించింది. నిష్టతో మనం అనుకున్న పని మనం చేస్తే ఫలితం దానంతదే వస్తుంది. అప్పుడు ప్రతి పత్రికా మనమెంటే ఎవరని ఆరా తీస్తుంది, మన గురించి తనే తెలుసుకుంటుంది.
  మీరేమంటారు? సేవా కార్యక్రమాలు జోడిద్దామటారా?
  — ప్రసాద్
  http://charasala.wordpress.com

  స్పందించండి
 • 8. వీవెన్  |  2:14 ఉద. వద్ద సెప్టెంబర్ 1, 2006

  చరసాల గారి వ్యాఖ్యకి సంబంధించి చర్చ
  తెలుగుబ్లాగు గూగుల్ సమూహంలో జరుగుతూంది.

  స్పందించండి
 • 9. jana  |  12:04 సా. వద్ద సెప్టెంబర్ 1, 2006

  ‘ఈ-తెలుగు’కు సేవలందిస్తున్న మీకందరికీ నమస్సులు…కిరణ్ గారితో ఇటీవలే నాకు పరిచయం ఏర్పడింది. తెలుగులో బ్లాగింగ్ మెళుకవలను కిరణ్ గారే నాకు నేర్పారు.ఇక మీ అందరితో నేను పంచుకోవాలనుకొంటున్న విషమేటంటే…సిఫీ తెలుగు ఛానల్‌ను యూనీ కోడ్‌లో తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. త్వరలో ఇది సాకారమవుతుంది.

  స్పందించండి
 • 10. వీవెన్  |  12:28 సా. వద్ద సెప్టెంబర్ 1, 2006

  jana, మంచివార్త. సరికొత్త తెలుగు సిఫీ కోసం ఎదురుచూస్తూఉంటాం.

  స్పందించండి
 • 11. వీవెన్  |  12:58 సా. వద్ద సెప్టెంబర్ 6, 2006

  3వ అంశానికి వెబ్ లంకెలు:
  http://www.nidha.com/article/building-a-page-with-indic-scripts-using-unicode-i
  http://www.nidha.com/article/building-a-page-with-indic-scripts-using-unicode-ii

  స్పందించండి
 • […] 2006 సమావేశం, ఆగష్టు 2006, నవంబర్ […]

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


ఆగస్ట్ 2006
సో మం బు గు శు
« జూలై   సెప్టెం »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

ఇటీవలి టపాలు


%d bloggers like this: