తెలుగు బ్లాగర్ల సమావేశం (జూలై 2006) విశేషాలు

జూలై 23, 2006 at 4:16 సా. 6 వ్యాఖ్యలు

తెలుగు బ్లాగర్ల సమావేశం — జూలై 2006

హాజరు: భాస్కర రావు, చంద్రశేఖర్, కశ్యప్, చదువరి, వీవెన్, వెంకట రమణ,
మరియు మురళీ కృష్ణ కూనపరెడ్డి

త్రివిక్రమ్ జ్వరం కారణంగా రాలేకపోయాడు. అతను త్వరగా కోలుకోవాలని
ఆశిద్దాం. ఈసారి విశేషం: నలుగురు కొత్తవాళ్ళు! ముందు అనుకున్నట్టుగా
హంగ్రీ జాక్స్ దగ్గర కలిసాం. చదువరి, వెంకట రమణ, నేను ఒక జట్టుగా…
రావుగారు, చంద్రశేఖర్, కశ్యప్ మరో జట్టుగా వేచిచూస్తున్నాం (పక్క
పక్కనే). వీళ్ళు వాళ్ళే కావచ్చు వాళ్ళు వీళ్ళే కావచ్చు అనుకొన్నా, కశ్యప్
ఫోన్ చెయ్యడంతో అందరం ఒక జట్టయ్యాం. అక్కడినుండి వెంగళరావు నగర్ పార్కుకి
వెళ్ళి అక్కడ చర్చ మొదలెట్టాం. ఇంకొద్ది సేపటికి మురళీ కృష్ణ కూడా
చేరాడు. ఎప్పటిలాగే సమయం తెలియలేదు,రెండు గంటల కన్నా ఎక్కువసేపే
కూర్చున్నాం (పార్క్ కాపరి తాళం వేసుకోవాలి అంటున్నాకూడా ఒక్క గంటే అని
అతనికి నచ్చజెప్పి మరీ).

ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. వాటిలో ముఖ్యమైనవీ, చేయవలసినవి ఇవీ:

1. తెలుగులో రాసే మహిళా బ్లాగర్లకు అవార్డులు (బయో సింఫనీ తరపున):
దీనిపై భాస్కరరావుగారు సవివరమైన ప్రకటన చేస్తారు. రాబోయే కాలంలో, ఈ
అవార్డుల కార్యక్రమాన్ని అన్ని తెలుగు బ్లాగులకి కూడా వర్తింపజేసే
ఉద్దేశం ఉంది.
ఈ అవార్డుల ప్రధానాన్ని, వార్తాంశంగా పత్రికల, TVల వారికి చేరవేసే బాధ్యత
కశ్యప్‌ది.

2. కంప్యూటర్‌కి తెలుగు నేర్పడం:
కంప్యూటరున్న ప్రతి తెలుగువాడూ తమ కంప్యూటర్‌లో తెలుగు చూడడం, రాయడం
చేయగలగాలి. అందుకు అనుగుణంగా కంప్యూటర్‌ని మలచడం, సాధారణ వాడకందార్లకు
కష్టం. ఈ పనిని సులభం చేయడానికి ఒక వెబ్‌పేజీనో/అప్లికేషనో తయారుచేయాలి.
దీనిపై ఒక ఆవశ్యకాల విశ్లేషణ (Requirements Analysis) పత్రం నేను
(వీవెన్) తయారుచేస్తా. ఇక అసలు ప్రోగ్రామింగ్ బాధ్యత చంద్రశేఖర్, మురళి
కృష్ణలది.

3. తెలుగు బ్లాగుల గురించి ప్రజలకు తెలియజేయడం:
“కొత్త పుంతలు తొక్కుతున్న నేటి తెలుగు బ్లాగులు” అన్న శీర్షికతో
భాస్కరరావుగారు ఒక వ్యాసం రాస్తారు. దీన్ని వెంకట రమణ సాంఖ్యీకరించి
(digitize) తెలుగుబ్లాగు సమూహానికి పోస్ట్ చేస్తాడు. సభ్యులందరూ వారి
వారి అభిప్రాయాలను, సూచనలను తెలియజేయవచ్చు. వీటన్నింటినీ సమీక్షించి ఆ
వ్యాసాన్ని పత్రికలలో ప్రచురణకి సిద్ధంచేయడంలో భాస్కరరావుగారికి, చదువరి
సహాయమందిస్తారు.

4. రాబోయే తెలుగు బ్లాగు సమావేశాలని, “నగరంలో ఈనాడు” వంటి శీర్షికలలో
చోటుచేసుకోవడానికి కశ్యప్ కృషిచేస్తాడు.

5. బ్లాగులపై బ్లాకింగ్‌ని ఎత్తివేసారు కాదా, ఆ విషయంపై ఇప్పుడు
పత్రికలకి రాయడం మనం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు, కనుక ఆ
ప్రయత్నాన్ని విరమించాం.

తర్వాతి సమావేశానికల్లా ఇవన్నీ పూర్తవాలి.

హైదరాబాదులో ఉంటున్న తెలుగు బ్లాగర్లందరూ ఈ సమావేశాలకి వస్తారని ఆశిస్తున్నాం.

వీవెన్.

ప్రకటనలు

Entry filed under: Telugu.

తెలుగు బ్లాగర్ల సమావేశం — జూలై 2006 @ Sun, Jul 23 10am – 11am కంప్యూటర్‌కి తెలుగు నేర్పే ఉపకరణం

6 వ్యాఖ్యలు Add your own

 • […] ఈ విడత తెలుగు బ్లాగర్ల సమావేశంలో చర్చించిన తెలుగు ఉపకరణానికి ఇది ఆవశ్యక విశ్లేషణ పత్రం. అన్ని సాంకేతిక వివరాలు ఇక్కడ చర్చించలేదు. ముందుగా ఎలా చెయాలో అనుకొని ఆ ప్రకారం చేసుకుపోవడమే. […]

  స్పందించండి
 • 2. charasala  |  7:30 సా. వద్ద జూలై 24, 2006

  సమావేశ వివరాలు తెలిపినందుకు చాలా సంతోషము. తెలుగులో బ్లాగు ఎలా రాయాలో తెలియచేసే లంకెలతో చిన్న ప్రకటన తయారు చేసి, హైదరాబాదులో వున్న అన్ని internet cafe లలో ప్రదర్షిస్తే ఎలా వుంటుంది? ఎంతో మందికి ఉత్సాహం వుండవచ్చు, ఇప్పుడున్న సదుపాయాలు తెలియక బలవంతంగా ఇంగ్లీషుతో వేగుతూ వుండవచ్చు.
  నన్ను ఎప్పటినుండో వేదిస్తున్న ఇంకో సమస్య, చిన్న పిల్లలకు విధ్యాపరమైన వెబ్‌సైటులు తెలుగులో లేకపోవటము. మా మూడేళ్ళ అమ్మాయికి తప్పనిసరై http://www.pbskids.org లాంటి వెబ్‌సైటులే చూపించాల్సి వస్తోంది. తెలుగు అక్షరాలు నేర్చుకోవటానికి interActive గా వుండే చిన్న పిల్లలు ఆడుకునే విధంగా ఏమీ లేవనే చెప్పాలి. ఈ విషయమై కొద్దిగా ప్రయత్నం చేయాలి.

  — ప్రసాద్
  http://charasala.wordpress.com

  స్పందించండి
 • 3. gsnaveen  |  1:37 సా. వద్ద ఆగస్ట్ 7, 2006

  హైదరాబాదు లో లేని తెలుగు ఔత్సాహిక బ్లాగర్లు ఏలా సహాయపడగలరు? దయచేసి తెలుపగలరు.

  స్పందించండి
 • 4. వీవెన్  |  9:20 ఉద. వద్ద ఆగస్ట్ 12, 2006

  నవీన్, మీరు సాంకేతిక నిపుణులైతే, తెలుగు ఉపకరణం తయారీలో సహకరించడానికి చందు లేదా మురళికృష్ణలని సంప్రదించండి. మీకు మీడియా ప్రతినిధులెవరైనా తెలిసిఉంటే తెలుగు బ్లాగుల ఉనికి గూర్చి వారికి తెలియజేయండి. తెలుగుబ్లాగు గుంపులో క్రియాశీలంగా ఉండండి.

  స్పందించండి
 • 5. Devaraaju  |  6:53 ఉద. వద్ద మార్చి 14, 2007

  I want to join in ur association.

  స్పందించండి
 • […] జూలై 2006 సమావేశం, ఆగష్టు 2006, నవంబర్ 2006 […]

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


జూలై 2006
సో మం బు గు శు
    ఆగ »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

ఇటీవలి టపాలు


%d bloggers like this: