Archive for జులై 23rd, 2006

కంప్యూటర్‌కి తెలుగు నేర్పే ఉపకరణం

ఈ విడత తెలుగు బ్లాగర్ల సమావేశంలో చర్చించిన తెలుగు ఉపకరణానికి ఇది ఆవశ్యక విశ్లేషణ పత్రం. అన్ని సాంకేతిక వివరాలు ఇక్కడ చర్చించలేదు. ముందుగా ఎలా చెయాలో అనుకొని ఆ ప్రకారం చేసుకుపోవడమే.

లక్ష్యం:
* వాడకందారు యొక్క కంప్యూటర్‌ని తెలుగుకి (చదవ మరియు రాయగల్గడానికి) సిద్ధంచేయడం. (ఈ ఉపకరణం కొద్దిపాటి కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారైనా సులభంగా ఉపయోగించేవిధంగా ఉండాలి.)

ఊహాజనిత ఉపయోగిత విధానం:
1. వాడకందారు మన ఉపకరణాన్ని ఒక వెబ్‌పేజీ నుండి దిగుమతి చేసుకుంటాడు. (ఒకవేళ మన ఉపకరణం అన్ని నిర్వాహక వ్యవస్థ (నివ్య) లకి సరైనది కాకపోతే, ఈ వెబ్‌పేజీ వాడకందారు ఉపయోగిస్తున్న నివ్యకి అనుగుణమైన వెర్షన్‌నే చూపిస్తుంది.)
2. దిగుమతిచేసుకున్న ఉపకరణాన్ని వాడకందారు నడుపుతాడు.
3. మన ఉపకరణం ఈ ఈ పనులు చేస్తుంది:
(అ) తెలుగు చూడడానికి కంప్యూటర్ సిద్ధంగా ఉందోలేదో చూడడం:
(i) నివ్య XP అయితే: సంక్లిష్ట లిపులకి కావాల్సిన తోడ్పాటుని చేతనం చేయడం. (Control Panel > Regional Settings > Languages > Install files for complex script languages)
(ii) నివ్య Windows98/ME/2000: IE6 విహరిణి, USP10 DLL, మరియు పోతన ఫాంట్‌లని నిక్షిప్తం చేయడం.
(iii) లినక్స్ అయితే: పాంగోతో కూడిన ఫైర్‌ఫాక్స్, పోతన ఫాంట్‌లని నిక్షిప్తం చేయడం.
(ఆ) తెలుగు రాయడానికి సిద్ధంగా ఉందోలేదో చూడడం:
(i) నివ్య XP అయితే: తెలుగు IMEని చేతనం చేయడం. దాంతోబాటు ఇటీవలే విడుదలైన మైక్రోసాఫ్ట్ భాషా ఇండియా వారి ఫొనెటిక్ ఎడిటర్‌ని కూడా నిక్షిప్తం చేయడం.
(ii) లినక్స్ అయితే తదనుగుణంగా
(ఇ) వాడకందారు యొక్క సౌలభ్యంకోసం (టైపింగ్ మరియు ఇతర) సహాయాన్ని కూడా కంప్యూటర్‌లో భద్రపరుస్తుంది.

గమనిక: పైన చెప్పిన కొన్ని ఉపకరణాల్ని మనం (న్యాయపరమైన ఇబ్బందులవల్ల) మూటగట్టి ఇవ్వలేకపోతే, అప్పటికప్పుడే వెబ్ నుండి దిగుమతిచేసి నిక్షిప్తంచేయాలి.

తెలుగు ప్రోగ్రామర్లూ, ఈ ఉపకరణం తయారీలో సహాయపడండి. దీని సాధ్యాసాధ్యాలను, అమలుచేయడంలో ఉన్న ఇబ్బందులను చర్చించండి. మరిన్ని వివరాలని చేర్చండి.

వీవెన్

6 comments జులై 23, 2006

తెలుగు బ్లాగర్ల సమావేశం (జూలై 2006) విశేషాలు

తెలుగు బ్లాగర్ల సమావేశం — జూలై 2006

హాజరు: భాస్కర రావు, చంద్రశేఖర్, కశ్యప్, చదువరి, వీవెన్, వెంకట రమణ,
మరియు మురళీ కృష్ణ కూనపరెడ్డి

త్రివిక్రమ్ జ్వరం కారణంగా రాలేకపోయాడు. అతను త్వరగా కోలుకోవాలని
ఆశిద్దాం. ఈసారి విశేషం: నలుగురు కొత్తవాళ్ళు! ముందు అనుకున్నట్టుగా
హంగ్రీ జాక్స్ దగ్గర కలిసాం. చదువరి, వెంకట రమణ, నేను ఒక జట్టుగా…
రావుగారు, చంద్రశేఖర్, కశ్యప్ మరో జట్టుగా వేచిచూస్తున్నాం (పక్క
పక్కనే). వీళ్ళు వాళ్ళే కావచ్చు వాళ్ళు వీళ్ళే కావచ్చు అనుకొన్నా, కశ్యప్
ఫోన్ చెయ్యడంతో అందరం ఒక జట్టయ్యాం. అక్కడినుండి వెంగళరావు నగర్ పార్కుకి
వెళ్ళి అక్కడ చర్చ మొదలెట్టాం. ఇంకొద్ది సేపటికి మురళీ కృష్ణ కూడా
చేరాడు. ఎప్పటిలాగే సమయం తెలియలేదు,రెండు గంటల కన్నా ఎక్కువసేపే
కూర్చున్నాం (పార్క్ కాపరి తాళం వేసుకోవాలి అంటున్నాకూడా ఒక్క గంటే అని
అతనికి నచ్చజెప్పి మరీ).

ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. వాటిలో ముఖ్యమైనవీ, చేయవలసినవి ఇవీ:

1. తెలుగులో రాసే మహిళా బ్లాగర్లకు అవార్డులు (బయో సింఫనీ తరపున):
దీనిపై భాస్కరరావుగారు సవివరమైన ప్రకటన చేస్తారు. రాబోయే కాలంలో, ఈ
అవార్డుల కార్యక్రమాన్ని అన్ని తెలుగు బ్లాగులకి కూడా వర్తింపజేసే
ఉద్దేశం ఉంది.
ఈ అవార్డుల ప్రధానాన్ని, వార్తాంశంగా పత్రికల, TVల వారికి చేరవేసే బాధ్యత
కశ్యప్‌ది.

2. కంప్యూటర్‌కి తెలుగు నేర్పడం:
కంప్యూటరున్న ప్రతి తెలుగువాడూ తమ కంప్యూటర్‌లో తెలుగు చూడడం, రాయడం
చేయగలగాలి. అందుకు అనుగుణంగా కంప్యూటర్‌ని మలచడం, సాధారణ వాడకందార్లకు
కష్టం. ఈ పనిని సులభం చేయడానికి ఒక వెబ్‌పేజీనో/అప్లికేషనో తయారుచేయాలి.
దీనిపై ఒక ఆవశ్యకాల విశ్లేషణ (Requirements Analysis) పత్రం నేను
(వీవెన్) తయారుచేస్తా. ఇక అసలు ప్రోగ్రామింగ్ బాధ్యత చంద్రశేఖర్, మురళి
కృష్ణలది.

3. తెలుగు బ్లాగుల గురించి ప్రజలకు తెలియజేయడం:
“కొత్త పుంతలు తొక్కుతున్న నేటి తెలుగు బ్లాగులు” అన్న శీర్షికతో
భాస్కరరావుగారు ఒక వ్యాసం రాస్తారు. దీన్ని వెంకట రమణ సాంఖ్యీకరించి
(digitize) తెలుగుబ్లాగు సమూహానికి పోస్ట్ చేస్తాడు. సభ్యులందరూ వారి
వారి అభిప్రాయాలను, సూచనలను తెలియజేయవచ్చు. వీటన్నింటినీ సమీక్షించి ఆ
వ్యాసాన్ని పత్రికలలో ప్రచురణకి సిద్ధంచేయడంలో భాస్కరరావుగారికి, చదువరి
సహాయమందిస్తారు.

4. రాబోయే తెలుగు బ్లాగు సమావేశాలని, “నగరంలో ఈనాడు” వంటి శీర్షికలలో
చోటుచేసుకోవడానికి కశ్యప్ కృషిచేస్తాడు.

5. బ్లాగులపై బ్లాకింగ్‌ని ఎత్తివేసారు కాదా, ఆ విషయంపై ఇప్పుడు
పత్రికలకి రాయడం మనం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు, కనుక ఆ
ప్రయత్నాన్ని విరమించాం.

తర్వాతి సమావేశానికల్లా ఇవన్నీ పూర్తవాలి.

హైదరాబాదులో ఉంటున్న తెలుగు బ్లాగర్లందరూ ఈ సమావేశాలకి వస్తారని ఆశిస్తున్నాం.

వీవెన్.

6 comments జులై 23, 2006


 

జులై 2006
సో మం బు గు శు
    ఆగ »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

ఇటీవలి జాబులు

ఇటీవలి అభిప్రాయములు

e-తెలుగు ఎలా ఏర్పడిం… on తెలుగు బ్లాగర్లు మరియు వికీపీడ…
e-తెలుగు ఎలా ఏర్పడిం… on ఆగష్టు నెల తెలుగు బ్లాగర్ల సమా…
e-తెలుగు ఎలా ఏర్పడిం… on తెలుగు బ్లాగర్ల సమావేశం (జూలై …
rammohan on తెలుగు బ్లాగర్లు మరియు వికీపీడ…
rammohan on తెలుగు బ్లాగర్లు మరియు వికీపీడ…

Blogroll